1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

మైడియర్ వాట్సన్ ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు.. జగన్‌కు పవన్ ప్రశ్నలు

pawan kalyan
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు ప్రశ్నల వర్షం కురిపించారు. మైడియర్ వాట్సన్.. వాలంటీర్ల వ్యవస్థతో పాటు బైజూస్ కంటెంట్‌పై తాను సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. డేటా గోప్యత చట్టాలు అందరికీ ఒకేలా ఉంటాయని వ్యాఖ్యానించారు. 
 
గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇవి ఏపీలో పెను దుమారం రేపుతున్నాయి. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించమని వాలంటీర్లకు ఎవరు చెప్పారంటూ ఆయన నిలదీస్తున్నారు. దీంతో పలుచోట్ల వాలంటీర్లను ప్రజలు నిలదీస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇదే అంశంపై పవన్ మరోమారు ట్వీట్ చేశారు. ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. 
 
అందరి ఆందోళన ఒక్కటే మైడియర్ వాట్సన్.. మీరు ముఖ్యమంత్రి అయినా కాకపోయినా డేటా గోప్యత చట్టాలు అలాగే ఉంటాయి. కాబట్టి ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అంటూ ప్రశ్నించారు. వాలంటీర్లకు బాస్ ఎవరు?, ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారు?, వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానపుడు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం వారికి ఎవరు ఇచ్చారు? అంటూ జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. వ్యక్తిగత సమాచారం. ఎవరైనా ప్రైవేటు వ్యక్తి దగ్గర ఉంటే అది క్రైమ్. అంటూ గతంలో జగన్ పాదయాత్ర సమయంలో చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోలను కూడా ఆయన షేర్ చేశారు. 
 
అలాగే, బైజూస్ కంటెంట్‌పై పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు రూ.580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్‌లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ రూ.18,000 నుండి రూ.20,000 ఉంటుంది.
 
2. బైజూస్ సీఈవో రవీంద్రన్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 8వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా కంటెంట్ లోడ్ చేసి ఇస్తామని ఒప్పుకున్నారు.
 
3. వచ్చే సంవత్సరం మళ్ళీ ప్రభుత్వం రూ.580 కోట్ల ఖర్చుతో 5 లక్షల ట్యాబ్లెట్లు కొననుందా?
 
ప్రశ్నించదగిన అంశాలు
 
1. బైజూస్ కంటెంట్ కోసం వచ్చే సంవత్సరం నుండి ఖర్చు ఎవరు చెల్లిస్తారు? కంపెనీ వారు ప్రతీ సంవత్సరం ఉచితంగా ఇస్తారా? ఈ విషయంలో క్లారిటీ లోపించింది. 8వ తరగతి విద్యార్థులకు ప్రతీ సంవత్సరం బైజూస్ వారు కంటెంట్ లోడ్ చేసిన ట్యాబ్లెట్లు ఉచితంగా ఇస్తారని ప్రభుత్వం చెప్పింది. కానీ బైజూస్ సంస్థ మాత్రం ఎక్కడా ఇప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఉచితంగా కంటెంట్ ఇస్తామని చెప్పలేదు.
 
2. ఒకవేళ కంపెనీ వారు ఖర్చు భరించకపోతే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? ఏపీ ప్రభుత్వమా లేక విద్యార్థులా? ఒకవేళ ప్రభుత్వం భరిస్తే మరో రూ.750 కోట్లు బైజూస్ కంటెంట్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది (ఒక్కో విద్యార్థికి 15 వేల చొప్పున 5 లక్షల విద్యార్థులు = రూ.750 కోట్లు)
 
3. 8వ తరగతి నుండి 9వ తరగతికి విద్యార్థులు వచ్చినప్పుడు వారి పరిస్థితి ఏంటి? 9వ తరగతి కంటెంట్ ఖర్చు ఎవరు భరిస్తారు?
 
4. బైజూస్ సంస్థ వారు ఏ మాధ్యమంలో, ఏ సిలబస్ అందజేస్తారు? వారు ఏ విధానం ఆధారంగా సిలబస్ రూపొందిస్తున్నారు? సీబీఎస్సీ/స్టేట్ సిలబస్ లేదా అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్నారా?
 
జవాబు: సీబీఎస్సీ సిలబస్ ఆధారంగా కంటెంట్ రూపొందించాం అని సంస్థ వారు పేర్కొన్నారు.