ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 జులై 2023 (22:11 IST)

కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో జనసేనాని భేటీ.. ట్వీట్ వైరల్

pawan - amit shah
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం రాత్రి సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఈ సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. "గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో అద్భుతమైన సమావేశం జరిగింది. ఈ భేటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్నమైన భవిష్యత్‌కు దారితీస్తుందని తాను ఖచ్చితంగా భావిస్తున్నాను" అంటూ పేర్కొన్నారు.
nadendla - shah
 
కాగా, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఎన్డీయే పార్టీల సమావేశంలో పాల్గొన్నారు. ఆ రాత్రికి అక్కడే ఉన్న ఆయన.. బుధవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రితో సమావేశమై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.
pawan - shah