మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 జులై 2023 (16:50 IST)

వెనక్కి తగ్గని పవన్ కళ్యాణ్ : వాలంటీర్లకు బాస్ ఎవరు?

pawankalyan
వాలంటీర్లపై తాను చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేయాలని ఆదేశించినప్పటికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోమారు ఏపీలోని వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తనపై ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆయన స్పందించారు. ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. పౌరుల డేటా సేకరణపై వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 
'పౌరుల డేటా సేకరణపై వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. వాలంటీర్ల బాస్ ఎవరు? ప్రైవేట్ డేటాను సేకరించడానికి వారికి ఎవరు సూచనలు ఇస్తారు? వాలంటీర్ల వ్యవస్థ ప్రైవేట్ కంపెనీ అయితే, దానికి అధిపతి ఎవరు? లేదా అది ఏపీ ప్రభుత్వమైతే డేటా సేకరించమని ఎవరు ఆదేశించారు? అది చీఫ్ సెక్రటరీనా? సీఎంనా? కలెక్టరా? ఎమ్మెల్యేనా? ఎవరు?' అంటూ నిలదీశారు. ప్రధానమమంత్రి కార్యాలయం, కేంద్ర హోం మంత్రి కార్యాలయాన్ని పవన్ ట్యాగ్ చేశారు.
 
మరోవైపు 'జనసేన శతఘ్ని' టీమ్ షేర్ చేసిన ట్వీట్‌ను పవన్ రీట్వీట్ చేశారు. 'ఏ ప్రభుత్వ శాఖకు చెందని వాలంటీర్లు సేకరిస్తున్న డేటాపై ప్రజల్లో మొదలైన వ్యతిరేకత. డేటా లీకేజీ అంశంపై పవన్ కల్యాణ్ నిజాలు బయటపెట్టడంతో ప్రశ్నించడం మొదలుపెట్టిన ప్రజలు. త్వరలో రాష్ట్రమంతా ఉద్యమంలా ప్రజలు వైసీపీపై తిరుగుబాటు మొదలు పెడతారు. సిద్ధంగా ఉండు జగన్' అని అందులో పేర్కొన్నారు. ఓ వాలంటీర్‌ను ఒకరు నిలదీస్తున్న వీడియోను తమ ట్వీట్‌కు శతఘ్ని టీమ్ జత చేసింది.
 
పెళ్లిళ్ళు చేసుకోవడం.. వదలివేయడం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ 
 
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు విర్శలు ఎక్కుపెట్టారు. పెళ్లిళ్లు చేసుకోవడం, భార్యలను వదిలివేయడం పవన్ క్యారెక్టర్ అంటూ విమర్శలు గుప్పించారు. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, ఆయన బావమరిది బాలకృష్ణ, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్స్ ఎలాంటివో అందరికీ తెలుసని అన్నారు. చంద్రబాబుకు పదేళ్లుగా వాలంటీర్‌గా పవన్ ళ్యాణ్ పని  చేస్తున్నారంటూ మండిపడ్డారు. వాలంటీర్ క్యారెక్టర్ల గురించి కోట్ల మంది ప్రజలకు బాగా తెలుసుని ఆయన అన్నారు. 
 
పవన్ కళ్యాణ్ చేపట్టి వారాహి యాత్ర సందర్భంగా వాలంటీర్ల వ్యవస్థ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వీటిపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. పెళ్లిళ్లు, విడాకులు, అక్రమ సంబంధాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వాలంటీర్ పవన్ అంటూ సెటైర్లు వేశారు. తిరుపతి వెంకటగిరిలో చేనేత నేస్తం పథకం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.
 
'వాలంటీర్ల సేవలను తప్పుబడుతున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, బావమరిది క్యారెక్టర్స్ ఎలాంటివో అందరికీ తెలుసు. మన వాలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారా? పెళ్లిళ్లు చేసుకోవడం, కాపురాలు చేయడం, వదిలేయడం పవన్ కల్యాణ్ క్యారెక్టర్. అలాంటి వ్యక్తా వాలంటీర్ల గురించి మాట్లాడేది? ఒకరిని వివాహం చేసుకుని.. మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకునే వ్యక్తా వలంటీర్ల వ్యక్తిత్వం గురించి మాట్లాడేది?" అంటూ మండిపడ్డారు.
 
'మరొకడేమో యూట్యూబ్‌లో డ్యాన్సులు చేస్తూ కనిపిస్తాడు. ఇంకొకడేమో 'అమ్మాయిలు కనిపిస్తే ముద్దులు పెట్టుకోవాలి.. కడుపు చేయాలి' అంటాడు. ఒకరు టీవీ షోకి వెళ్లి 'బావా మీరు సినిమాల్లో చేశారు.. నేను నిజంగా చేశాను' అంటాడు" అని విమర్శలు చేశారు. "ఒక్కడిదేమో బీజేపీతో పొత్తు.. చంద్రబాబుతో సంసారం. ఇచ్చేది బీ ఫామ్.. టీడీపీకి బీ టీం” అని ఎద్దేవా చేశారు.
 
“వాలంటీర్ల క్యారెక్టర్ గురించి కోట్ల మంది ప్రజలకు తెలుసు. వాలంటీర్ల క్యారెక్టర్‌ను తప్పుబట్టింది బాబుకు పదేళ్లుగా వాలంటీర్‌గా ఉంటున్న ఈ ప్యాకేజి స్టార్ అని పవన్‌పై విమర్శలు గుప్పించారు. ఒకరిని పెళ్లి చేసుకొని మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.