గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (19:35 IST)

ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం.. జల్లెడ పడుతున్న స్థానికులు

Uppada
ఏపీ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో బంగారం కోసం వేట కొనసాగుతోంది. గత రెండు రోజులుగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో బంగారం కోసం జల్లెడ పడుతున్నారు స్థానిక మత్స్యకారులు. బంగారం కోసం వెతుకుతున్న స్థానికులకు ఇప్పటికే రూపులు, చెవి దిద్దులు, ఉంగరాలు, బంగారు రేణువులతో  పాటు వెండి వస్తువులు కూడా దొరికాయని చెప్తున్నారు. 
 
బుధవారం రోజు కొందరికి బంగారు నగలు కూడా దొరికాయి. గతంలోని రాజుల కోటలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుఫాను సమయంలో బయటపడుతున్నట్లు మత్స్యకారులు చెప్తున్నారు. ఇక, వరుసగా రెండు తుఫాన్ల కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.