ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 29 జనవరి 2020 (16:06 IST)

ఏపీలో కొందరు సీనియర్‌ ఐఏఎస్‌లకు పదోన్నతులు

రాష్ట్రంలో కొందరు సీనియర్‌ ఐఏఎస్‌లకు పదోన్నతులు లభించాయి. ముఖ్య కార్యదర్శులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా... కార్యదర్శులకు ముఖ్యకార్యదర్శులుగా పదోన్నతి లభించాయి. మరికొందరికి సంయుక్త కార్యదర్శులుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ప్రిన్సిపల్‌ సెక్రటరీలుగా ఉన్న రజత్‌ భార్గవ్‌, జవహర్‌రెడ్డి, అనంతరాము, ప్రవీణ్‌కుమార్‌కు స్పెషల్‌ చీఫ్ సెక్రటరీలుగా పదోన్నతులు లభించాయి.
 
సెక్రటరీ హోదాలో ఉన్న జి.జయలక్ష్మీ, ఉషారాణి, రామ్‌గోపాల్‌కు ప్రిన్సిపల్‌ సెక్రటరీగా... జాయింట్‌ సెక్రటరీలుగా ఉన్న ముత్యాలరాజు, బసంత్‌కుమార్‌కు పదోన్నతి లభించింది. ఇంటర్‌ క్యాడర్‌ ట్రాన్స్‌ఫర్ల ద్వారా ఏపీకి ఇద్దరు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. 
 
నాగాలాండ్‌, యూపీ క్యాడర్‌కు చెందిన.. మంజిర్‌ జిలానా సమూన్‌, తమీమ్‌ అన్సారియాకు విశాఖలో పోస్టింగ్‌ లభించింది. వీఎంఆర్డీఏ అదనపు కమిషనర్‌గా మంజిర్‌ జిలానీ సమూన్‌, జీవీఎంసీ కమిషనర్‌గా తమీమ్‌ అన్సారియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.