శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 సెప్టెంబరు 2022 (16:35 IST)

నదిని దాటుకెళ్తూ పరీక్ష కోసం సాహసం.. వీడియో వైరల్

woman
woman
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక యువతి సాహసం చేసింది. పీకల్లోతు వరద నీటిలో నడుచుకుంటూ మరీ విజయనగరం నుండి విశాఖపట్నం బయలుదేరింది.  
 
వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం, మర్రివలస గ్రామానికి చెందిన తడ్డి కళావతి అనే యువతి విశాఖలో పరీక్షకు హాజరయ్యేందుకు ఓ పెద్ద సాహసమే చేసింది. భారీ వర్షాల కారణంగా చిత్రావతి నదిలో వరద నీరు చేరడంతో.. ఆ గ్రామానికి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 
 
ఎవరూ బయటకు వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. అలాంటిది కళావతి అనే యువతి మాత్రం పరీక్ష రాయడం కోసం ఇల్లు దాటి బయటకు వచ్చింది. తనకు పరీక్ష ఉండడంతో పరీక్షకు ఖచ్చితంగా హాజరవ్వాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం నదిని దాటేందుకు సిద్ధమైంది.
 
సోదరుల సహకారంతో వారి భుజాలపై నదిని దాటి.. అక్కడి నుంచి మరో వాహనంలో విశాఖ చేరుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.