శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: శుక్రవారం, 28 ఆగస్టు 2020 (15:35 IST)

టీడీపీకి మరో షాక్, వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు

ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో రమేష్ బాబు పార్టీ కండువాను కప్పుకున్నారు. తాడేపల్లి లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది.
 
ఎంపీ విజసాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెందుర్తి నుంచి రమేష్ బాబు గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో మంత్రి కన్నబాబుపై పోటీ చేసి ఓడిపోయారు. ఇక విశాఖ రాజధానిని టీడీపీ వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కొన్ని నెలల క్రితమే  పార్టీకి రాజీనామా చేశారు.
 
ఇక మూడు రాజధానుల నిర్ణయానికి ఓకే చెబుతూ తాజాగా పంచకర్ల రమేష్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు పంచకర్ల రాకతో విశాఖలో వైసీపీ బలం మరింత పెరగనుంది.