AP Assembly Photo Shoot: పవన్ గారూ ఫ్రెష్‌గా వున్నారు.. ఫోటో షూట్‌కు హాజరుకండి: ఆర్ఆర్ఆర్ (video)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ గైర్హాజరు కావడంతో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు అధ్యక్షత వహించినప్పుడు ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అసెంబ్లీ కార్యకలాపాల గురించి చర్చిస్తున్నప్పుడు, రేపటి (మంగళవారం) టీ విరామంలో ఫోటో సెషన్ జరుగుతుందని రఘురామ కృష్ణం రాజు ప్రకటించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఉండటం వల్ల ఫోటో సెషన్‌కు పరిపూర్ణత వస్తుందని పేర్కొంటూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఫోటో సెషన్‌కు హాజరు కావాలని ప్రత్యేకంగా కోరారు.
"రేపటి ఫోటో షూట్‌కు మీరు ఖచ్చితంగా అక్కడ ఉండాలి సార్. మీరు ఇప్పుడు చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నారు… మీ ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తోంది.
మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారు, కాబట్టి అదే ఉత్సాహంతో, రేపు ఫోటో షూట్‌కు మీరు హాజరు కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అని రఘురామ కృష్ణం రాజు అన్నారు.