రైతన్నల కోసం.. అన్నదాత సుఖీభవ పథకం.. యనమల ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 2019-20 సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్‌ను 11వ సారి ప్రవేశపెట్టారు. నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగింది.
దానివల్ల రాజధాని నగరాన్నో కోల్పోయామని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. 2019-20 బడ్జెట్ అంచనా రూ.2,26,117.53కోట్లు కాగా, గతేడాది కన్నా ఇది 18.38శాతం పెరిగిందని.. రెవెన్యూ మిగులు రూ.2099.47కోట్లుగా అంచనా వేయగా, ఆర్థికలోటు 32,390.68కోట్లుగా అంచనా వేశారు.
ఆంధ్రప్రదేశ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2019-20 ముఖ్యాంశాలు..
చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహానికి రూ.400 కోట్లు
వెనుకబడిన వర్గాల కార్పొరేషన్లకు రూ.3వేల కోట్లు
ఇళ్ల స్థలాల సేకరణ కోసం రూ.500 కోట్లు
ఈ బడ్జెట్‌లో రైతులకు మరో వినూత్న పథకం రైతు సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ పథకం. ఈ పథకానికి రూ.5వేల కోట్లు కేటాయించినట్లు యనమల ప్రకటించారు.