శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 8 జూన్ 2018 (20:43 IST)

ఏపీకి ఇచ్చిన రూ.350 కోట్లు కేంద్రం వెనక్కి తీస్కుంది... ఉష్ణపక్షి ప్రతిపక్షం: యనమల

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం తన చేతిలో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన రూ.350 కోట్లు తిరిగి తీసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇది

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం తన చేతిలో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన రూ.350 కోట్లు తిరిగి తీసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇది బ్యాంకు నిబంధనలకు వ్యతిరేకమన్నారు. నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.12,879 కోట్లు వచ్చాయమన్నారు. లోటు బడ్జెట్ కింద మరో రూ.12 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. దీంతో పాటు చట్టప్రకారం రావాల్సినవి, విభజన సందర్భంగా పార్లమెంట్ లో ఇచ్చిన హామీల మేరకు నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడంలేదన్నారు.
 
ఉష్ణపక్షిలా ప్రతిపక్షం విమర్శలు...
ఇసుకలో తల దూర్చి ప్రపంచాన్ని పట్టించుకోని ఉష్ణపక్షిలా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని పట్టించుకోకపోవడం, నిజాలను గుర్తించకపోవడం ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి ఈ నాలుగేళ్లలో జరిగినా, ఏమీ జరగనట్లు ప్రజలను వచించడం హాస్యాస్పదమన్నారు. నిజాలను ఒప్పుకునే పరిస్థితుల్లో విపక్షాలు లేవన్నారు. 
 
కేంద్రం తీరుపై విపక్ష నేతలెవరూ మాట్లాడడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై ఛార్జిషీట్ విడుదల చేస్తాననడం అవివేకమన్నారు. నాలుగేళ్ల నుంచి ఏటా డబుల్ డిజిట్ గ్రోత్ సాధించడం అభివృద్ధి కాదా? అని ఆయన ప్రశ్నించారు. మెథడాలజీ ప్రకారం గ్రోత్ రేట్ లెక్కిస్తారన్నారు. రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతోందని మంత్రి అన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఎంపీల రాజీనామాలు ఆమోదించినా ఎన్నికలు రావన్నారు. ఎంపీలు రాజీనామా పత్రాలిచ్చినా, మరోసారి కన్ఫర్మ్ లెటర్లు అడగడం పార్లమెంట్ చరిత్రలోనే మొదటిసారి అని అన్నారు.