సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Updated : శుక్రవారం, 8 జూన్ 2018 (11:06 IST)

గురజాడ మునిమనవడు జీతం పెంచిన ఏపీ ప్రభుత్వం

గురజాడ అప్పారావు మునిమనవడు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్‌ గౌరవ వేతనాన్ని రూ.12,500 నుంచి రూ.20,000కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. విజయనగరం జిల్లాలో ఉన్న గురజాడ అప్పారావు నివాసాన్న

గురజాడ అప్పారావు మునిమనవడు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్‌ గౌరవ వేతనాన్ని రూ.12,500 నుంచి రూ.20,000కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. విజయనగరం జిల్లాలో ఉన్న గురజాడ అప్పారావు నివాసాన్ని సాంస్కృతిక శాఖ తన పరిధిలోకి తీసుకున్న విషయం విదితమే. 
 
ఆ ఇంటిలో 1989 నుంచి గ్రంథాలయంతో పాటు గురజాడకు చెందిన పురాతన వస్తువులను ప్రదర్శనగా ఉంచింది. దానికి వెంకటేశ్వర ప్రసాద్‌ను కాంట్రాక్ట్‌ పద్ధతిన మేనేజర్‌గా నియమించింది. ఆయనకు ప్రతి నెలా రూ.12,500 గౌరవ వేతనం అందిస్తోంది. దాన్ని పెంచాల్సిందిగా ఆయన చేసిన విన్నపం మేరకు రూ.20,000కు ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు ఆదేశాలు జారీచేసింది.