సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 జూన్ 2018 (11:48 IST)

17న ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు.. ప్రధాని మోడీతో భేటీనా?

ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తినకు వెళ్లనున్నారు. ఆ రోజున జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్థిక మంత్రి అరుణ్

ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తినకు వెళ్లనున్నారు. ఆ రోజున జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారిద్దరితో చంద్రబాబు సమావేశం అవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
 
మరోవైపు, నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, ప్రత్యేక హోదా, కేంద్రం తీరుపై సీఎంల సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. పోలవరం, రాజధాని నిర్మాణం వంటి అంశాల్లో కేంద్రం తీరు వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇందులో ప్రస్తావించాలని చంద్రబాబు భావిస్తున్నారు.
 
సమైఖ్య స్ఫూర్తికి విరుద్దంగా కేంద్రం వ్యవహరిస్తోందన్న అంశంపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలపై గట్టిగా అభ్యంతరం తెలపాలని ఈ నెల 17వ తేదీన జరిగే ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎంఓ ఆఫీసు కసరత్తు ప్రారంభించింది.