ఏపీ ఉప ముఖ్యమంత్రిగా అనిల్ కుమార్ యాదవ్???
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఇప్పటి వరకు మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిద్దరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. పైగా, ఈ ఇద్దరు నేతలు బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలు. ఇపుడు ఈ రెండు మంత్రివర్గ పోస్టులను భర్తీ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి.
అయితే, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చి.. ప్రస్తుతం మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్‌ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈయన యాదవ సామాజికవర్గానికి చెందిన నేత. పైగా, సీఎం జగన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడు. ఈ కారణాలతోనే ఆయనుకు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు సమాచారం.