సీఎం CBN స్నేహధర్మం అద్భుతం, దాదాపు సీఎంతో సమానంగా పవన్ కల్యాణ్, బాధ్యతలు స్వీకరణ (video)
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్నేహ ధర్మాన్ని అద్భుతంగా చూపిస్తున్నారు. బహుశా ఇలాంటి అద్భుతమైన స్నేహితుడు ఆయన జీవితంలో... అంటే అత్యంత ఆత్మీయ స్నేహితుడు పవన్ కల్యాణ్‌కు మించినవారు తారసపడలేదేమోనంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే శ్రీ పవన్ కల్యాణ్ గారి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ దీన్ని చూపిస్తోంది.
డిప్యూటీ సీఎం పదవి కేవలం పవన్ కల్యాణ్ గారి వరకే పరిమితం చేసారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పదవిని ఐదారుగురికి ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సీఎం ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో కూడా వుంచాలని ఆదేశాలు జారీ చేసారు. అలాగే పటిష్టమైన వై క్యాటగిరీ భద్రతను ఆయనకు కల్పించారు. ఇలా మొత్తమ్మీద తన స్నేహితుడు పవన్ కల్యాణ్ పట్ల ఆత్మీయతను చాటుకుంటున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు.