శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 5 జూన్ 2024 (14:33 IST)

ఏపీ అసెంబ్లీ రిజల్ట్స్‌ను 100 శాతం అంచనా వేసిన కేకే సర్వేస్, శభాష్

KK Surveys exit poll
ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలపై జాతీయ ఎగ్జిట్ పోల్స్ నుంచి ప్రాంతీయ సంస్థల వరకూ ఎన్నో చేసాయి. కానీ కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఫలితాలు మాత్రం దాదాపు 99 శాతం నిజమయ్యాయి. వైసిపి అధికారం కోల్పోయి అధఃపాతాళానికి పడిపోతుందనీ, ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా పోయి కేవలం 14 సీట్లకే పరిమితమవుతుందని తేల్చింది. 
 
అంతేకాదు.. జనసేన పార్టీ నూటికి నూరు శాతం 21 స్థానాలను గెలుచుకుంటుందనీ, తెలుగుదేశం పార్టీ 133 స్థానాల్లో విజయబావుటా ఎగురవేస్తుందని చెప్పారు. ఇప్పుడు దాదాపుగా ఇవే ఫలితాలు రావడంతో కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ నాటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా చూడండి.