శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 22 జూన్ 2017 (15:34 IST)

సీఎంతో సహా సెల్యూట్... నారా లోకేష్ నో సెల్యూట్.. ఏంటి చెప్మా(వీడియో)

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఆవిష్కరించారు. రిమోట్ ద్వారా 100 అడుగుల ఎత్తుగల జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి ఎగురవేశారు.

ఎయిర్ పోర్ట్ అధికారులు భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని, ప్రతి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అన్ని ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లలో తప్పనిసరిగా జాతీయ జెండాలను ఏర్పాటు చేయాలన్నారు ముఖ్యమంత్రి. జాతీయ జెండాన రూపొందించిన పింగళి వెంకయ్య మన తెలుగువాడు కావడం గర్వించదగ్గ విషయం అన్నారు. 
 
ఇకపోతే జాతీయ జెండాను ఎగురవేసే సమయంలో సీఎంతో సహా ప్రజాప్రతినిధులు జెండాకు గౌరవ వందనం చేశారు. కానీ మంత్రి నారా లోకేష్ మాత్రం జెండాకు వందనం చేసినట్లు కనిపించలేదు. జాతీయ గీతం ఆలాపన అలా సాగినంత సేపు ముఖ్యమంత్రితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులందరూ గౌరవ వందనం చేస్తే లోకేష్ మాత్రం మౌనంగా వుండిపోయారు. చూడండి వీడియోను...