1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: మంగళవారం, 23 ఆగస్టు 2016 (13:56 IST)

పి.వి సింధుతో బాడ్మింటన్ ఆడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

విజ‌య‌వాడ : ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించిన షటిల్ బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు, కోచ్ గోపీచంద్‌లకు విజయవాడలో ఘన స్వాగతం లభించింది. మంత్రులు నారాయణ, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు తదితరులు విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం చెప్పారు. అక్కడ నుంచి ఓ

విజ‌య‌వాడ : ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించిన షటిల్ బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు, కోచ్ గోపీచంద్‌లకు విజయవాడలో ఘన స్వాగతం లభించింది. మంత్రులు నారాయణ, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు తదితరులు విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం చెప్పారు. అక్కడ నుంచి ఓపెన్ బస్‌లో ర్యాలీగా బయల్దేరి విజయవాడ మున్సిపల్ స్టేడియంకు చేరుకున్నారు. స్టేడియం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎదురేగి స్వాగతం చెప్పారు.
 
ఆ తర్వాత వారంతా వేదిక పైకి చేరుకున్నారు. ఆ సందర్భంగా పలువురు సింధును, గోపీచంద్‌ను అభినందిస్తూ పుష్పగుచ్ఛాలు అందించారు. శాలువాలతో సత్కరించారు. సింధుపై ప్రత్యేక గీతం రాసి ఆలపించారు. అందులో స్వర్ణాంధ్ర లక్ష్యం చంద్రబాబుది అయితే స్వర్ణపతకం లక్ష్యం సింధూది.. బాబు అండగా ఉండగా, సింధు స్వర్ణం ఖాయం అంటూ పాట పాడారు. 
 
హైదరాబాద్‌లో జరిగిన సన్మానంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పాల్గొంటే, విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను సింధు, గోపీచంద్‌లు కలిసినప్పుడు ఆయన సత్కరించి ఐదు కోట్ల చెక్ అందచేశారు. ఏలూరు ఎమ్.పి మాగంటి బాబు సింధూకు, ముఖ్యమంత్రికి షటిల్ రాకెట్‌లను బహుకరించారు. ఆ రాకెట్‌లతో చంద్రబాబు, సింధులు బాడ్మింటన్ ఆడటం విశేషం. వేదికపైనే వీరిద్దరు కొద్దిసేపు బాడ్మింటన్ ఆడారు. మంత్రులు, ఎమ్.పిలు కూడా ఆమెకు సత్కారం చేశారు.