మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 23 నవంబరు 2014 (15:47 IST)

నదుల అనుసంధానం తప్పనిసరి : చంద్రబాబు డిమాండ్

రాష్ట్రంలోని నదులను అనుసంధానించడం తప్పనిసరిగా చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఆయన న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నదుల అనుసంధానం అనే అంశంపై జరిగిన ‘జల మంథన్’ సదస్సులో వ్యాఖ్యానించారు.
 
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నదుల అనుసంధానం అంశం మీద ఎప్పటినుంచో చర్చ జరుగుతున్నాయన్నారు. నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు నదుల అనుసంధానం తప్పనిసరి అన్నారు. 
 
కొన్ని దేశాలలో అయితే ఏకంగా సముద్రపు నీటినే మంచినీరుగా మార్చుకుంటున్నాయని తెలిపారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో 34 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్థితిలో నీటి నిర్వహణ మరింత జాగ్రత్తగా వుండాలి. 
 
రాష్ట్రంలో ఉన్న గోదావరి, కృష్ణ నదులను అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, పలువురు ఉన్నతాధికారులు, నీటి పారుదల రంగ నిపుణులు, తదితరులు పాల్గొన్నారు.