కోవిడ్-19.. ఏపీలో రోజుకు 7వేల కేసులు.. డీఎడ్ పరీక్షలు వాయిదా..
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి జరగాల్సిన డిఎడ్ పరీక్షలను కోవిడ్-19 కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారమైతే... డి.ఈఐ.ఈడీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ సెప్టెంబర్ 28న జరగాల్సి ఉంది. విద్యాశాఖ అధికారులు అందుకు ఏర్పాట్లు కూడా చేయాలనుకున్నారు. కానీ కరోనా వైరస్ విజృంభించడంతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రోజూ 7వేల దాకా కొత్త కేసులు వస్తుండటంతో... ఈ పరిస్థితుల్లో ఈ పరీక్షలు జరపడం కష్టమేనని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. తాజా ఆదేశం ప్రకారం ఈ పరీక్షలు మళ్లీ ఎప్పుడు జరిపేదీ తెలపలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ పరీక్షలు జరగబోవని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7,073 కరోనా కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 661458కి పెరిగింది. కొత్తగా 48 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 5606కి చేరింది. కొత్తగా 8,695 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,88,169 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 67,683 యాక్టివ్ కేసులున్నాయి.