మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 26 సెప్టెంబరు 2020 (13:15 IST)

డ్రగ్స్ కేసు విచారణలో రకుల్ చెప్పింది ఇదే, శిక్ష పడుతుందా?!

సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు విచారణలో డ్రగ్స్ కేసు బయటపడటం... కొంతమంది సినీ తాలర పేర్లు తెర పైకి రావడం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడంతో ఒక్కసారిగా టాలీవుడ్ షాక్ అయ్యింది. విచారణకు హాజరైన రకుల్ ఏం చెప్పింది అనేది ఆసక్తిగా మారింది. 
 
దాదాపు 3 గంటల పాటు జరిగిన విచారణలో రకుల్ నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇండియా టుడే ఛానల్ రకుల్ చెప్పింది ఇదే అంటూ ఆసక్తికరమైన కథానాన్ని ప్రసారం చేసింది. 
 
ఇంతకీ ఏమని ప్రసారం చేసిందంటే... ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు. రియా కోరిక మేరకు డ్రగ్స్ తన ఇంట్లో దాచినట్టు ఒప్పుకుంది అని. విచారణ కంటే ముందు ముంబయిలోని రకుల్ ఫ్లాట్లో సోదాలు నిర్వహించారు.
 
ఈ సోదాల్లో మాదకద్రవ్యాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. అయితే, ఆ డ్రగ్స్ తనవి కావని, రియా కోరిన మీదట తన ఫ్లాట్లో ఉంచినట్టు రకుల్ అంగీకరించిందని సమాచారం. తనకు ఏ ఒక్క డ్రగ్ డీలరు తెలియదని చెప్పింది. డ్రగ్స్ సేవించకపోయినా... ఇంట్లో డ్రగ్స్ దాచడం కూడా చట్టరీత్యా నేరం. 
 
ఈ విషయం తెలిసినప్పటి నుంచి రకుల్ ఈ కేసు నుంచి బయటపడుతుందా..? లేదా... ఒకవేళ శిక్షపడితే.. ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందన్నది ఆసక్తిగా మారింది.