శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 26 సెప్టెంబరు 2020 (13:39 IST)

భారీ వర్షం, 9500 కోళ్లు జలసమాధి, రైతులు కన్నీళ్లు

శుక్రవారం నాడు అకాలంగా కురిసిన భారీ వర్షానికి పౌల్ట్రీ రైతు అపారంగా నష్టపోయాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలోని ఈదులపల్లి కూడా గ్రామ శివారులో గల యాదిరెడ్డి చెందిన ఫామ్‌లో 9500 ఫారం కోళ్ళు మృత్యువాత పడ్డాయి.
 
వీటి విలువ సుమారు 6 లక్షల వరకు ఉంటుందని యాదిరెడ్డి వాపోయారు. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నీళ్లు పెద్ద ఎత్తున పౌల్ట్రీ ఫారంలోకి వచ్చాయని, దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ కోళ్లు మృత్యువాత పడ్డాయి. పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.