శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (17:42 IST)

అతివృష్టితో అనంతపురం జిల్లాలో నీట మునిగిన పంటలు

అతివృష్టి కారణంగా అనంతపురం జిల్లాలో పంటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంటలు నోటికి అందకుండా పోయింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనంతపురంలో వేరుశెనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎడతెరపి లేని వర్షాలతో పొలాల్లోనే పంటలు కుళ్లిపోయే పరిస్థితి నెలకొంది.
 
లక్షల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట వర్షాలకు నేలపాలు కావడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో దెబ్బతిన్న పంటలపై రైతులు దిగ్బ్రాంతికి గురైయ్యారు. ఏటా పంటలు ఎండిపోయి కరువు ఛాయలు కమ్ముకునే అనంతపురంలో ఈ ఏడాది భారీ వర్షాలు రైతులను నిండా ముంచాయి. దీంతో వేరుశెనగ, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
 
దీనికి తోడు వరి, పత్తి పంటలు కూడా నీట మునగడంతో రైతులు లక్షల్లో పెట్టుబడులను కోల్పోయారు. అకాల వర్షాలతో నిండా మునిగిన రైతులను ఆదుకోవాలను రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.