శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (17:08 IST)

ఆ డ్రెస్ నాకు సరిపోలేదు.. లెగ్గిన్ వేసుకుని పై కోటు వేసుకున్నా..?: విద్యుల్లేఖ (Video)

vidhylekha
సహాయ నటి విద్యుల్లేఖ రామన్ బాగా బరువు తగ్గింది. ఇటీవల ఆమెకు నిశ్ఛితార్థం కూడా జరిగిపోయింది. ఈ నేపథ్యంలో తనకు ఎదురైన ఓ ఘటనకు సంబంధించిన ఓ విషయాన్ని షేర్ చేసుకుంది. బొద్దుగా వుండకూడగని.. ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్‌గా వుండాలనుకున్నానని చెప్పుకొచ్చింది.
 
ఓ తమిళ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతోంది. ఆ వేడుకకు వెళ్లడానికి తనకు సరిపోయే దుస్తులు దొరకలేదు. తవ వద్ద ఉన్న ఒక్క డ్రెస్‌ కూడా సరిపోలేదు. అందుకే లెగ్గిన్‌ వేసుకుని.. ఆ షేమ్‌ను దాచడానికి పైన కోటులాంటిది వేసుకున్నానని తెలిపింది. 
 
ఆ రోజు మానసిక ఒత్తిడితో పాటు తనపై తనకే చాలా కోపం వచ్చిందని.. ఇకపై బాధపడ్డది చాలు.. తానెందుకు సన్నగా ఉండాలి. తనకు దాని అవసరం లేదు, రాదని తనలో తాను అనుకున్నానని వెల్లడించింది. కానీ అదృష్టవశాత్తు ఫిబ్రవరి 2019న కొన్ని అనుభవాల వల్ల తనలో తానే స్ఫూర్తి నింపుకున్నానని చెప్పుకొచ్చింది. 
 
ఆపై తనలో వచ్చిన తేడాను ఆపై వచ్చిన ఫోటోల్లో మీరే చూడొచ్చునని తెలిపింది. ఏదైనా మన కోసం మనం చేయాలి అని ఆమె ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. మరోపక్క ఆగస్టు 26న విద్యుల్లేఖ రోకా వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆమె చెప్పారు. త్వరలోనే వివాహ వేడుక జరగబోతోంది.