శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (20:01 IST)

హోటల్ గదిలో ప్రియుడితో ప్రేయసి.. శృంగారం శృతిమించడంతో..?

సోషల్ మీడియాలో పరిచయాలు.. ఆపై ప్రేమ.. తర్వాత చెట్టాపట్టాలేసుకుని తిరగడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. అలా సోషల్ మీడియాలో పరిచయామైన ఓ వ్యక్తితో కలిసి 19 ఏళ్ల యువతి హోటల్ గదికి వెళ్ళింది. అయితే గదిలో తన ప్రియుడితో శృంగారంలో పాల్గొన్న యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కేరళలోని కొచ్చిన్‌లో జరిగింది.  
 
వివరాల్లోకి వెళ్తే, కేరళలోని అలప్పుఝాకు చెందిన 19 ఏళ్ల యువతి ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఈనెల 12వ తేదీన కొచ్చిన్ వచ్చింది. కొచ్చిలో తనకు పరిచయమైనా గోకుల్‌ను కలిసింది. ఇద్దరు కలిసి హోటల్ రూమ్ తీసుకున్నారు. రూమ్‌లో శృంగారంలో మునిగిపోయారు. కాసేపటి తర్వాత గదిలో పెద్ద శబ్ధం వచ్చింది. ఇంకా బిగ్గరగా అరుస్తూ గోకుల్ బయటకు వచ్చాడు. అప్పటికే ఆ యువతి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.  
 
అధిక రక్తస్రావం కావడంతో వెంటనే ఆ యువతిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, ఆ యువతి అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ కేసులో పోలీసులు గోకుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణను వేగవంతం చేశారు.