సమ్మెను విరమించుకున్న ఏపీ విద్యుత్ ఉద్యోగులు
ఏపీ విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టే ఆలోచనను విరమించుకున్నారు. పీఆర్సీపై ఏకాభిప్రాయం కుదరడంతో సమ్మె నోటీసులను విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది.
గత కొన్నిరోజుల కిందట ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో గురువారం పెన్ డౌన్, సెల్ డౌన్... రేపటి (ఆగస్టు 10) నుంచి నిరవధిక సమ్మె చేయాలని విద్యుత్ జేఏసీ నిర్ణయించింది.
అయితే, పీఆర్సీతో పాటు 8 శాతం ఫిట్ మెంట్, ప్రధాన వేతన స్కేలు రూ.2.60 లక్షలు వంటి ప్రధాన డిమాండ్లకు ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ అంగీకరించింది. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది.