సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Updated : గురువారం, 15 జులై 2021 (14:58 IST)

ఏపీ ప్రభుత్వం దివాళా తీస్తోంది, అప్పు దొరకడంలేదు: దేవినేని ఉమ

అప్పుపుడితేనే.. జీతాలైనా, పెన్షన్లైనా, పథకాలైనా..అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని దుయ్య‌బ‌ట్టారు.

తెచ్చిన వేల కోట్ల అప్పులు లెక్కల్లో చూపరు... బిల్లుల కోసం కోర్టులకు కాంట్రాక్టర్లు తిర‌గాల్సిన దుస్థితి... అప్పు ఇవ్వడానికి బ్యాంకుల విముఖత... ఆర్థిక నిర్వహణ, క్రెడిట్ రేటింగ్, చెల్లింపుల పరంగా పాతాళంలోకెళ్లిన ఏపీ ఆర్థిక పరిస్థితికి మీరు కాదా కార‌ణం...  మీ పరిపాలన వైఫల్యం కారణం కాదా ? వైయస్ జగన్ అంటూ దేవినేని ఉమ ప్ర‌శ్నించారు.

ఏపీలో ప్ర‌భుత్వం దివాళా తీస్తోంద‌నే రీతిలో ఆయ‌న ట్వీట్ చేశారు. దేవినేని ఉమ ట్వీట్ పైన వైసిపీ నాయకులు మండిపడుతున్నారు.