సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (09:24 IST)

అప్పు తీర్చలేక కట్టుకున్న భార్యను అమ్మేశాడు.. ఎక్కడ?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భాపాల్‌లో ఓ అమానుష ఘటన జరిగింది. చేసిన అప్పు తీర్చలేక కట్టుకున్న భార్యను అమ్మేశాడు. తాజాగ వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రంలోని గున ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి విచ్చలవిడిగా ఖర్చులు చేసే అలవాటు వుంది. దీనికి కరోనా కష్టాలు తోడుకావడంతో తఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. దీంతో తన అవసరాల నిమిత్తం ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు.
 
అప్పు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిళ్లు రావడం, ఇప్పట్లో అప్పు తీర్చే దారి లేక ఆ వ్యక్తి ఓ ఉపాయాన్ని ఆలోచించాడు. ఈ క్రమంలో తన భార్యను లక్ష రుపాయలకు అమ్ముతున్నట్లు వాళ్లకే బేరం కుదుర్చుకున్నాడు. 
 
ఇక ఈ విషయాన్ని చెప్పడానికి పొలంలో పనిచేసుకుంటున్న తన భార్య దగ్గరికి వాళ్లని తీసుకెళ్లాడు. తన భార్యతో నిన్ను అమ్మేశానని, వాళ్లతో వెళ్లిపొవాల్సిందిగా చెప్పాడు. ఒక్కసారిగా భర్త నోటి నుంచి ఊహించని మాట వినేసరికి ఆమె షాక్‌లో ఉండిపోయింది. 
 
ఆ తర్వాత తేరుకుని భర్తపై ఎదురు తిరిగింది. ఆమె నిరాకరిస్తూ భర్తతో గొడవపడింది. దీంతో ఆ రాత్రి కోపంతో ఆ వ్యక్తి నిద్రపోతున్న తన భార్యను తీసుకెళ్లి బావిలో పడేశారు. ప్రాణాలతో బయటపడ్డ మహిళ తండ్రితో కలిసి పోలీసులకు ఆమె భర్త, అత్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.