గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2022 (18:28 IST)

ఆరోగ్య శ్రీ పథకంలోకి మరో 754 చికిత్సలు

Arogya Shree
ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత విస్తరించే దిశగా సీఎం జగన్ కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా నేడు వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాదు, ఇకపై మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.  
 
అలాగే ఆరోగ్యశ్రీ పథకంలోకి కొత్తగా మరో 754 చికిత్సలను చేర్చుతున్నట్టు వెల్లడించారు. దాంతో, ఆర్యోగశ్రీ కింద లభించే చికిత్సల సంఖ్య 3,118కి పెరిగింది. గణనీయంగా చికిత్సా విధానాలను పెంచుతున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ఇకపై కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లుగా మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు వ్యవహరించనున్నారు.