1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (11:57 IST)

వైకాపాపై సెటైర్లు విసిరిన పవన్ కల్యాణ్.. కార్టూన్ రూపంలో ఏకిపారేశారు..

Pawan Kalyan
జనసేన అధినేత పవన్ సైతం ప్రభుత్వం తీరుపై సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాకముందు మధ్య నిషేధంపై ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ కార్టూన్ రూపంలో పవన్ విమర్శలు చేశారు. 
 
వందల కోట్లు పోయాయని మేం ఏడుస్తుంటే మధ్యలో మద్య నిషేధం.. మధ్య నిషేధం అంటూ మీ గోలేందమ్మా’ అంటూ పవన్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన కార్టూన్‌ను షేర్ చేశారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ యజమానులు సిండికేట్ కావడం వల్ల ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల నష్టం అంటూ పవన్ విమర్శించారు. కేవలం జనసేన మాత్రమే కాదు.. ఏపీలో ఇతర విపక్షాలు సైతం మంత్రి అమర్ నాథ్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. 
 
ఇంకా వైకాపా సర్కారుపై పవన్ నిప్పులు చెరిగారు.  గతవారం మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minster Gudivada మద్యం నిషేధంపై పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా రాజకీయంగా కొనసాగుతూనే ఉంది. వైసీపీ మేనిఫెస్టోలో మద్య నిషేధం అనే పదమే లేదని, దశలవారీగాగా మద్యం నిషేధం చేస్తామని మాత్రమే హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.
 
పూర్తిస్థాయిలో మద్యపాన నిషేధం అని ఎక్కడా చెప్పలేదని, మందుబాబులకు షాక్ కొట్టేలా చేస్తామని మాత్రమే చెప్పామన్నారు. మీలో ఎవరికైనా డౌట్ ఉంటే రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ కార్యాలయంకు వెళ్లినా తమ మేనిఫెస్టో ఉంటుందని, చూసుకోవచ్చని అన్నారు. అమర్‌నాథ్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో విమర్శలు చేశారు.