గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 23 జులై 2022 (14:02 IST)

యాక్షన్ కింగ్ అర్జున్‌కు మాతృ వియోగం

Arjun and Lakshmi Devamma
Arjun and Lakshmi Devamma
ప్రముఖ స్టార్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ మాతృమూర్తి లక్ష్మీ దేవమ్మ నేడు పరమపదించారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. మైసూర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆమె పార్థీవ దేహం బెంగళూరు అపోలో హాస్పిటల్‌లో ఉంది. రేపు అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.
 
అర్జున్ త‌న స్వంత నిర్మాణ సంస్థ‌లో సినిమాలు నిర్మిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే ఆయ‌న కుమార్తె ఐశ్వ‌ర్య హీరోయిన్‌గా విశ్వ‌క్ సేన్ హీరోగా సినిమాను హైద‌రాబాద్‌లో ప్రారంభించాను. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోంది.