శుక్రవారం, 28 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (18:46 IST)

ఈ స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాలు రావాలి - పవన్ కళ్యాణ్

Pawan Kalyan,
Pawan Kalyan,
68వ జాతీయస్థాయి చలన చిత్ర పురస్కార విజేతలకు (పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు. ఈ దఫా పురస్కారాల్లో ఎక్కువ శాతం దక్షిణ భారత చిత్రసీమ నుంచి వచ్చిన చిత్రాలు దక్కించుకోవడం సంతోషించదగ్గ పరిణామం. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ సంగీత దర్శకుడిగా శ్రీ ఎస్.ఎస్.తమన్ (అల వైకుంఠపురం),  ఉత్తమ కొరియోగ్రఫీ శ్రీమతి సంధ్యా రాజు (నాట్యం), ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ శ్రీ టి.వి.రాంబాబు (నాట్యం), ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’ పురస్కారాలు కైవశం చేసుకొన్నందుకు ఆనందంగా ఉంది. వీరందరికీ నా అభినందనలు. ఈ స్ఫూర్తితో వీరి నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షిస్తున్నాను అని ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో  పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
 
ప్ర‌స్తుతం పవన్ కళ్యాణ్ ఒక‌వైపు సినిమాలు మ‌రోవైపు రాజ‌కీయాల్లో బిజీగా వున్నారు.  త్వ‌ర‌లో ఆయ‌న తాజా సినిమా షూటింగ్‌లో ప్ర‌వేశించ‌నున్నారు.