సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (23:13 IST)

చిరంజీవి ఊసరవెల్లి లాంటి వాడు.. చిల్లర బేరగాడు.. సీపీఐ నారాయణ (video)

CPI Narayana
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్‌ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ప్రస్తావించిన ఆయన ఆయనతో పాటు ఆయన సోదరుడు జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
తిరుపతిలో తాజాగా మీడియాతో మాట్లాడిన నారాయణ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహా విష్కరణకు చిరంజీవి హాజరైన విషయాన్ని తప్పుపట్టారు. 
 
అంతేగాక చిరంజీవి ఊసరవెల్లి లాంటి వాడని పేర్కొన్న నారాయణ చిల్లర బేరగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మెగా అభిమానులకు కోపం తెప్పిస్తోంది.
 
తాజాగా తిరుపతిలో మాట్లాడిన ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రేక్షకులకు అల్లూరిని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణను పిలవకుండా చిల్లర బేరగాడు చిరంజీవిని స్టేజి మీదకు తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు. 
 
అంతేకాక ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదో నాకు తెలియదు కానీ వచ్చి ఉంటే గౌరవంగా ఉండేదని ఆయన అన్నారు.
 
అలాగే పవన్ ఒక ల్యాండ్ మైన్ లాంటివాడని అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చారు. ఇక మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేకపోయినా జగన్ కేవలం తన కేసుల మాఫీ కోసమే ప్రభుత్వానికి సరెండర్ అయ్యారని మోడీ కనుసన్నల్లో ఆయన ఏం చెబితే అది చేస్తూ ఎన్టీఏ అభ్యర్థికి బేషరతు మద్దతు ప్రకటించారని అన్నారు.