సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 20 జులై 2022 (11:57 IST)

లేటెస్ట్ న్యూస్‌- ప‌వ‌న్ క‌ళ్యాణ్ అస్వస్థతకు కార‌ణం అత‌నే!

Jana Sena Party rally
Jana Sena Party rally
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయ మీటింగ్‌ల‌తో బిజీగా వున్నాడు. ఇప్ప‌టికే మూడు సినిమాలు షూటింగ్‌లోవున్నాయి. వాట‌కి కాస్త బ్రేక్ ఇచ్చాడు. గ‌త కొద్దిరోజులుగా వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు రావ‌డంతో ప‌లు ప్రాంతాల‌ను ఆయ‌న ప‌ర్య‌టిస్తున్నారు. ఆంధ్రాలో కొన్నిచోట్ల అద్వాన్నంగా వున్న రోడ్ల ఫొటోల‌ను జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు సోష‌ల్ మీడియాపెట్టి జ‌గ‌న్‌కు తెలియ‌జేసేలా చేశారు.

 
తాజాగా ఆయ‌న కొద్దిరోజులుగా భీమ‌వ‌రం, మండ‌పేట ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు.  బ‌య‌ట అలా తిరుగుతున్న ఆయ‌న ష‌డెన్గా అస్వ‌స్థ‌కు గుర‌య్యారు. దానికి కార‌ణం ఒక‌సారి ఆయ‌న గొడుగు లేకుండా వ‌ర్షంలో త‌డ‌వంతోపాటు ఆయ‌న‌కు ద‌గ్గ‌ర‌గా ఓ అభిమాని రావ‌డంతో అదుపు త‌ప్పి ప‌వ‌న్‌పై ప‌డ‌డంతో ప‌వ‌న్‌కు నొప్పి వ‌చ్చింద‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు తెలియ‌జేస్తున్నారు. కానీ మ‌రుస‌టిరోజు అలానే మ‌రో కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డంతో నొప్పి ఎక్కువ‌యింది. అప్ప‌టికే ఆయ‌న వ్య‌క్తిగ‌త డాక్ట‌ర్ ర‌మేష్ కూడా ద‌గ్గ‌రే వుండి అన్ని చ‌ర్య‌లు తీసుకున్నారు. వ‌ర్షం వ‌ల్ల వాతావ‌ర‌ణంలో మార్పు వ‌ల్ల ప‌వ‌న్ జ్వ‌రానికి గుర‌య్యారు. గ‌తంలో కూడా ఇదేవిధంగా ఆయ‌న‌కు జ్వ‌రం వ‌చ్చింది. అందుకే కొద్దిరోజులు రాజ‌కీయ కార్య‌క్ర‌మాల‌ను విశ్రాంతి తీసుకున్నార‌ని తెలుస్తోంది.

 
వ‌చ్చేవారం రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌
ఇదిలా వుండ‌గా, త్వ‌ర‌గా ఆయ‌న కోలుకుని వారం వారం ఆదివారంనాడు జ‌రిగే ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈసారి రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్రాంతాల‌లో ప‌ర్య‌టించాల్సివుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ ఈ శ‌నివారంనాడు ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు విశ్వ‌స‌సీయ స‌మాచారం.