శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (18:37 IST)

అల్లు అర‌వింద్ చెప్పింది నిజ‌మైంది- థ‌మ‌న్‌

thaman-Arjun
thaman-Arjun
68 వ జాతీయ సినిమా అవార్డులు నేడు ప్ర‌క‌టించారు. దేశంలో వివిధ భాష‌ల సినిమాల‌కు అందులోని వివిధ శాఖ‌ల‌కు చెందిన వారిని గుర్తించి ఉత్త‌మ కేట‌గిరి అవార్డులు అంద‌జేశారు. ఇక తెలుగులో చూసుకుంటే సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్‌కు అల‌వైకుంఠ‌పురంలో.. సినిమాకు రావ‌డం చాలా ఆనందంగా వుంద‌ని నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అయితే ఈ సినిమా విడుద‌లకు ముందు పాట‌లు బాగా పాపుల‌ర్ అయ్యాయి. ఈ సంద‌ర్భంగా అల్లు అర‌వింద్ మాట్లాడుతూ, ప‌దేళ్ళ‌వ‌ర‌కు ఈ పాట‌లు ప్రేక్ష‌కుల మ‌దిలో వుండిపోతాయ‌ని అన్నారు. అది నిజ‌మైంద‌ని థ‌మ‌న్ పేర్కొన్నారు. ఈ అవార్డు రావ‌డంప‌ట్ల అల్లు అర‌వింద్‌, అల్లు అర్జున్ కూడా సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అదేవిధంగా వివిధ కేట‌గిరిల‌లో వ‌చ్చిన అవార్డు గ్ర‌హీత‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.
 
 
వివిధ శాఖ‌లు, సినిమాల అవార్డుల వివ‌రాలు
 
ఉత్తమ చిత్రం :  సూరయైపొట్రు’  
 
ఉత్తమ నటుడు : సూర్య ,అజయ్ దేవగణ్ 
 
ఉత్తమ నటి :  అపర్ణ బాలమురళి 
 
ఉత్తమ దర్శకుడు :  కె. ఆర్. సచ్చిదానందన్  (అయ్యప్పమ్ కోషియమ్)
 
ఉత్తమ సహాయనటుడు :
బిజుమీనన్ ( అయ్యప్పమ్ కోషియమ్ )
 
ఉత్తమ సహాయ నటి - లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివ రంజినీయుము ఇన్నుమ్‌ సిలా పెంగలుమ్‌)
 
ఉత్తమ బాల నటుడు -  వరున్‌ బుద్దదేవ్‌(తులసీదాస్ జూనియర్‌)- స్పెషల్‌ మెన్షన్‌
 
ఉత్తమ నేపథ్యం సంగీతం - జీవీ ప్రకాష్ కుమార్
 
బెస్ట్ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ - నచికేట్‌ బర్వే, మహేష్‌ షేర్లా(తానాజీ)
 
బెస్ట్ లిరిక్‌ - సైనా(మనోజ్‌ మౌతషిర్‌)
 
మోస్ట్‌ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్‌ - మధ్యప్రదేశ్‌
 
బెస్ట్‌ స్టంట్స్‌ - అయ్యప్పనుమ్‌ కోషియమ్‌
 
బెస్ట్‌ కొరియోగ్రఫీ - నాట్యం (తెలుగు)
 
ఉత్తమ డ్యాన్సర్‌: సంధ్య రాజు (నాట్యం- తెలుగు)
 
ఉత్తమ సంగీత దర్శకుడు - తమన్‌ (అల వైకుంఠపురములో)
 
నాన్‌ ఫియేచర్‌ ఫిలింస్‌
 
 బెస్ట్‌ వాయిస్‌ ఓవర్‌: శోభా రాప్సోడీ ఆఫ్‌ రెయిన్స్‌- మాన్‌సూన్స్‌ ఆఫ్‌ కేరళ (ఇంగ్లీష్‌)
 
బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌: విశాల్‌ భరద్వాజ్‌  (1232 కి.మీ: మరేంగే తో వహీన్‌ జాకర్‌) (హిందీ)
 
బెస్ట్‌ ఎడిటింగ్‌: అనాదీ అతలే (బార్డర్‌ ల్యాండ్స్‌)
 
బెస్ట్‌ ఆన్‌లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌- సందీప్‌  భాటి, ప్రదీప్‌ లెహ్వార్‌ (జాదూయ్‌ జంగల్‌) (హిందీ)
 
బెస్ట్‌ ఆడియోగ్రఫీ(ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌): అజిత్‌ సింగ్‌ రాథోడ్‌ (పర్ల్‌ ఆఫ్‌ ద డిసర్ట్‌ ) (రాజస్థానీ)
 
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: నిఖిల్‌ ఎస్‌ ప్రవీణ్‌ (శబ్దికున్‌ కలప్ప) (మలయాళం)
 
ఉత్తమ డైరెక్షన్‌: ఆర్‌వీ రమణి (ఓ దట్స్‌ భాను- ఇంగ్లీష్‌, తమిళ్‌, మలయాళం, హిందీ)
  
ఉత్తమ కుటుంబ కథా చిత్రం: కుంకుమార్చన్‌ (మరాఠి)
 
ఉత్తమ షార్ట్‌ ఫిక్షన్‌ ఫిలిం: కచీచినుతు (అస్సాం)
 
స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌: అడ్మిటెడ్‌ (హిందీ, ఇంగ్లీష్‌)
 
బెస్ట్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఫిలిం: ద సేవియర్‌: బ్రిగేడియర్‌ ప్రీతమ్‌ సింగ్‌ (పంజాబీ)
 
బెస్ట్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఫిలిం: వీలింగ్‌ ద బాల్‌ (ఇంగ్లీష్‌, హిందీ)
 
బెస్ట్‌ ఎడ్యుకేషనల్‌ ఫిలిం: డ్రీమింగ్‌ ఆఫ్‌ వర్డ్స్‌ (మలయాళం )
 
బెస్ట్‌ ఫిలిం ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌: జస్టిస్‌ డిలేయ్‌డ్‌ బట్‌ డెలివర్‌డ్‌ (హిందీ), 3 సిస్టర్స్‌ (బెంగాలీ)
 
బెస్ట్‌ ఎన్వైర్‌మెంట్‌ ఫిలిం: మాన అరు మానుహ్‌ (అస్సామీస్‌)
 
బెస్ట్‌ ప్రొమోషనల్‌ ఫిలిం: సర్‌మొంటింగ్‌ చాలెంజెస్‌ (ఇంగ్లీష్‌)