శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (19:39 IST)

కృష్ణా జిల్లా: వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌లో జాబ్స్

Arogya Shree
Arogya Shree
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కృష్ణా జిల్లా వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాలకు రాత పరీక్షలు అవసరం లేదు. 
 
ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర, టీమ్‌ లీడర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  22 మంది ఆరోగ్య మిత్రలు, ఆరుగురు టీమ్ లీడర్లను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదిక ఎంపిక చేయనున్నారు. 
 
ఆరోగ్య మిత్ర ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారికి.. బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీ.ఫార్మసీ, ఫార్మా-డీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిగ్రీల్లో ఏదో ఒకటి ఉండాలి. టీమ్ లీడర్లుగా పని చేయాలని అనుకునేవారికి సైతం పైన పేర్కొన్న విద్యార్హతలతోపాటు హాస్పిటల్ సర్వీసెస్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
 
కంప్యూటర్ పరీక్ష సమయంలో అభ్యర్థులు ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తీసుకొని రావాల్సి ఉంటుంది. రెజ్యుమేతోపాటు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ తీసుకొని రావాల్సి వుంటుంది. 
 
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 28
పోస్టుల వివరాలు:
ఆరోగ్య మిత్ర పోస్టులు: 22
టీమ్‌ లీడర్‌ పోస్టులు: 6
 
అర్హతలు: బీఎస్సీ (నర్సింగ్‌)/ఎమ్మెస్సీ (నర్సింగ్‌)/బీఫార్మసీ/ఫార్మా డి/బీఎస్సీ (ఎంఎల్‌టీ) కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా కమ్యునికేషన్‌ నైపుణ్యాలు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.
 
పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.18,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
 
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 42 ఏళ్లకు మించరాదు.
 
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 11, 2022
 
ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, కంప్యూటర్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
 
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 
అడ్రస్: జిల్లా కో ఆర్డినేటర్‌, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌, కృష్ణా జిల్లా, ఏపీ.