శనివారం, 12 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (13:34 IST)

జగన్ ఢిల్లీ వెళ్లి శ్రీవారి ఫోటో మోదీకి ఇచ్చినా నో యూజ్?

cm jagan
ఏపీ సీఎం జగన్ ఏపీని నట్టేట ముంచేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, ఏపీ సహ ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్ ఫైర్ అయ్యారు. జగన్ మోహన్ రెడ్డి తన పాలనతో ఆంధ్ర ప్రదేశ్‌ను అధోగతి పాలు చేశారని విమర్శించారు. ఇంకా రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలో దింపేశారని అభిప్రాయపడ్డారు. 
 
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా ఏపీ పర్యటన సదర్భంగా సునీల్ దియోధర్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. జగన్ ఢిల్లీ వెళ్లి వేంకటేశ్వర స్వామి ఫోటో మోదీకి ఇచ్చి, ఆయన ఆశీస్సులు తీసుకున్నా ప్రయోజనం లేదన్నారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలో దింపారు. ఏపీ అభివృద్ధికి మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారు. జనసేతో ప్రస్తుతం పొత్తులో ఉన్నామని గుర్తు చేశారు.
 
జనసేనతో పొత్తు కారణంగా ఏపీలో సర్కారుపై పోరు తప్పదన్నారు. జనసేన-బీజేపీ సీఎం అభ్యర్థిపై ప్రకటన వుండబోదని సునీల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రోడ్ మ్యాప్ ఎప్పుడో సిద్ధమైంది. ఇప్పటికే మేం యాక్షన్‌లోకి దిగిపోయాం. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.