గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శనివారం, 25 ఆగస్టు 2018 (17:48 IST)

ప్రభుత్వాసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న మంత్రి అమరనాథ్ రెడ్డి...

పలమనేరు : కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని పలు సమావేశాలలో ప్రసంగించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి దాన్ని నిజమని నిరూపించారు. ఆ మేరకు శనివారం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్

పలమనేరు : కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని పలు సమావేశాలలో ప్రసంగించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి దాన్ని నిజమని నిరూపించారు. ఆ మేరకు శనివారం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా శ్రమించడంతో పాటు ,గత వారం రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉన్న మంత్రికి ఇన్ఫెక్షన్ కారణంగా కారబంకుల్(carbuncle)కు గురి అయ్యారు. 
 
అయితే విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ అక్కడ శస్త్ర చికిత్స ఏమాత్రం చేయించుకోక స్వస్థలమైన పలమనేరు చేరుకుని ప్రభుత్వాసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీంతో అక్కడి వైద్యులు మరియు సిబ్బంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడంతోపాటు మంత్రి నిర్ణయం పట్ల హర్షం వెల్లబుచ్చారు. ప్రభుత్వాసుపత్రుల వైపు కన్నెత్తయినా చూడని ఎంతోమందికి మంత్రి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ మంత్రిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వాసుపత్రులలో వైద్య సేవలను వినియోగించుకోవాలని సిబ్బంది కోరారు. 
 
నేడు ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండటంతోపాటు అనుభవజ్ఞులైన వైద్యులు ఇక్కడ పని చేయడం మెరుగైన సేవలను అందించడం జరుగుతుందని, కాబట్టి ప్రభుత్వాస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకోవడానికి మంత్రి ముందుకు రావడాన్ని అందరూ స్వాగతించాల్సిన అంశమన్నారు. ప్రజలలో ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత నమ్మకాన్ని కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని, అందరూ ప్రభుత్వ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపాలని ఆస్పత్రి వైద్యులు పిలుపునిచ్చారు. 
 
ప్రభుత్వాస్పత్రిలో మంత్రి శస్త్ర చికిత్స చేసుకుంటున్నారన్న సమాచారం  పట్టణంలో దావానంలా వ్యాపించడంతో స్థానికులు సైతం మంత్రి నిర్ణయాన్ని కొనియాడారు. ఆయన వెంట మంత్రి సతీమణి శ్రీమతి రేణుకా రెడ్డి, పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి, ఆస్పత్రి సూపరింటిండెంట్ వీణా కుమారి, వైద్యులు హరగోపాల్, శారదా మరియూ సిబ్బంది ఉన్నారు.