శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 13 ఆగస్టు 2018 (22:18 IST)

జగన్‌కు జ్ఞానం లేదు... అసెంబ్లీ ఎగ్గొట్టి జీతాలు తీసుకుంటున్నారు : మంత్రి దేవినేని

జగన్ జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో..లేదో? అర్ధం కావడం లేదని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. శాంతిభద్రతల్ని కాపాడే తమపై రైలు తగులబెట్టామని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షన్ చరిత్ర నుంచి వచ్చిన జగన్, దొంగే దొంగ అన్నట్లు వ్

జగన్ జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో..లేదో? అర్ధం కావడం లేదని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. శాంతిభద్రతల్ని కాపాడే తమపై రైలు తగులబెట్టామని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షన్ చరిత్ర నుంచి వచ్చిన జగన్,  దొంగే దొంగ అన్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. జగన్ ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడో అర్ధమవుతోందన్నారు. 
 
ప్రతిపక్ష నేతగా ప్రజలు ఇచ్చిన అవకాశం కూడా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. జీతాలు తీసుకుంటూ వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎగ్గొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్‌‌కు ఎల్లో మీడియా పేర్లు చెప్పే దమ్ము ధైర్యం కూడా లేవన్నారు. ఈ ప్రాజెక్టుపై జగన్‌ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేయించారని మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. పట్టిసీమ మాదిరిగానే పురుషోత్తమపట్నం పైనా కేసులు వేయించారన్నారు.