గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (19:15 IST)

రాజీనామా చేస్తానంటున్న మంత్రి బాలినేని.. షాక్‌కు గురైన సీఎం జగన్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ వార్త విన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఒకింత షాక్‌కు గురయ్యారు. అయితే, ఆయన రాజీనామా చేస్తానని చెప్పడానికి గల కారణాలు లేకపోలేదు. అసలు మంత్రి బాలినేని ఎందుకు రాజీనామా చేస్తానని చెప్పారో తెలుసుకుందాం.
 
ఏపీలో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌పై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో వైఎస్.. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు విమర్శించారన్నారు. ఆ తర్వాత చంద్రబాబే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారని గుర్తుచేశారు. 
 
అలాగే, తమ ప్రభుత్వం కూడా రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి కట్టుబడి ఉందన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచారని ధర్నాలు చేస్తే కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారని గుర్తుచేశారు. 
 
వ్యవసాయ మోటర్లకు స్మార్టు మీటర్లు పెట్టాలని కేంద్ర ఆదేశించిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ఒకవేళ విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.