సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (20:17 IST)

రాజధాని అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ : మంత్రి బొత్స

రాజధాని అమరావితలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైనపుడు అన్ని వివరాలను బహిర్గతం చేస్తామంటూ ఆయన సోమవారం ప్రటించారు. 
 
ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, రాజధానిలో జరిగిన భూ అక్రమాలపై తమ వద్ద పూర్తి సమాచారం ఉందని.. సరైన సమయంలో ఆ అక్రమాల చిట్టా బహిరంగ పరుస్తామన్నారు. కేంద్ర మాజీ మంత్రి తనకు రాజధానిలో భూములే లేవంటున్నారని.. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన సవాల్‌ విసిరితే మొత్తం వివరాలు బయటపెడతామని హెచ్చరించారు. 
 
భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్‌ పేర్కొన్న నాలుగు రాజధానుల అంశాన్ని మీడియా ప్రతినిధులు బొత్స వద్ద ప్రస్తావించగా.. ఆ విషయం టీజీనే అడగాలంటూ సలహా ఇచ్చారు. రాజధానిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గతంలో ఏం చెప్పారో.. ఇప్పుడేం మాట్లాడారో రికార్డు చూడాలని కోరారు. 
 
అమరావతిపై గతంలో భాజపా కూడా ఆరోపణలు చేసిందన్నారు. రాజధాని అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో చెందినది కాదన్నారు. కౌలు అందలేదని రైతులు ఆందోళన చేస్తున్నారనీ, ఇదే అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడానని, వారం రోజుల్లో కౌలు చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పైగా, రాజధానిపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడివున్నట్టు ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.