రోజాకు ఏమైంది.. కళ్లు కనిపించట్లేదా?: పీతల సుజాత ఎద్దేవా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రోజాపై ఏపీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. అసెంబ్లీలోనైనా.. మీడియా ముందైనా ఎక్కడ పడితే అక్కడ నువ్వా నేనా అని పోటీపడుతూ సుజాత-రోజా పిల్లీ ఎలుకలా వ్యవహరిస్తారనే సంగతి తెలిస
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రోజాపై ఏపీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. అసెంబ్లీలోనైనా.. మీడియా ముందైనా ఎక్కడ పడితే అక్కడ నువ్వా నేనా అని పోటీపడుతూ సుజాత-రోజా పిల్లీ ఎలుకలా వ్యవహరిస్తారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రోజా చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి పీతల సుజాత విరుచుకుపడ్డారు.
రాష్ట్రం కరవులో అల్లాడుతుంటే.. సీఎం చంద్రబాబు విహారయాత్రలకు వెళ్లారంటూ వైకాపా ఎమ్మెల్యే రోజా ఆరోపణలను ఖండించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రోజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
కరవులో ఉన్న రైతులను ముఖ్యమంత్రి ఆదుకున్నప్పుడు ఈ విమర్శలు చేస్తున్న రోజా ఎక్కడుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సహా మంత్రులంతా అనంతపురంలో ఉండి పంటలకు నీళ్లందించారని.. కరవుపై వారు చేసిన పోరాటం రోజాకు కనిపించ లేదా? అని ప్రశ్నించారు. రోజా విమర్శలు చూస్తుంటే.. ఆమె కళ్లు మూసుకుపోయినట్టు ఉన్నాయని పీతల ఎద్దేవా చేశారు.