సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 29 జూన్ 2020 (19:49 IST)

కత్తికి సైనైడ్ పూసి మంత్రి నాని అనుచరుడి దారుణ హత్య

మచిలీపట్నం చేపల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు అయిన భాస్కరరావును గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పరారయ్యారు. సైనైడ్ పూసిన కత్తులతో భాస్కరరావును దుండగులు అత్యంత దారుణంగా మార్కెట్ యార్డ్ సమీపంలోనే పొడిచారు.
 
ఈ హత్యలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. కత్తులతో పొడిచిన తర్వాత వారంతా మోటారు బైకులపై పరారయ్యారు. రక్తపు మడుగులో పడి వున్న భాస్కర రావును ఆస్పత్రిలో చేర్పించారు. ఐతే ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
 
పాత కక్షల నేపధ్యంలో ఈ హత్య జరిగి వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా భాస్కర రావు హత్య వార్త విన్న వెంటనే మంత్రి పేర్ని నాని అక్కడికి వెళ్లారు. మృతుడు భాస్కర్ రావు దేహాన్ని చూసి బోరుమంటూ విలపించారు.