1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2023 (14:39 IST)

కిలో కందిపప్పు ధర రూ.65 మాత్రమే... ఎక్కడ?

toor dall
దేశ వ్యాప్తంగా కందిపప్పు ధర మండిపోతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ ధరలు రూ.110 నుంచి రూ.140 వరకు పలుకుతున్నాయి. అయితే, ఏపీలో మాత్రం పేదలకు ఊరటనిచ్చేలా రూ.65కే లభిస్తుంది. ఏపీ పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఏర్పాట్లుచేసింది. నెలకు 14542 టన్నుల కందిపప్పును పంపిణీ చేసేందుకు సిద్ధం చేసింది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 1.45 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఐసీడీఎస్ పథకం కింద 1097 టన్నుల కందిపప్పును వినియోగిస్తున్నారు. సగటున నెలకు రేషన్ దుకాణాల ద్వారా కేవలం 6 వేల నుంచి 6500 టన్నుల మాత్రమే విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అన్ని మండల నిల్వ కేంద్రాల్లో 1771 టన్నుల మేరకు కందిపప్పు అందుబాటులో ఉంది. 
 
దీనికితోడు మరో 25 వేల టన్నుల సేకరణకు పౌరసరఫరాల శాఖ టెండర్లను ఖరారు చేసి సరఫరాకు అనుమతి ఇచ్చింది. దీంతో మొత్తం 20770 టన్నుల కందిపప్పు నిల్వలు పంపిణీకి సిద్ధంగా ఉంది. ఇది మరో మూడు నెలల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేయొచ్చని ఏపీ పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ తెలిపింది.