1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 24 అక్టోబరు 2023 (20:50 IST)

సినీ నటులు కళాకారులే గానీ రాజకీయ నేతలు కాదు : పవన్ కళ్యాణ్

pawankalyan
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్టు అంశంలో తెలుగు చిత్రపరిశ్రమ స్పందించకపోవడంతో జనసేన పార్టీ  అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సినీ నటులు కళాకారులే గానీ రాజకీయ నేతలు కాదన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్ నగరంలో మహా మ్యాక్స్ న్యూస్ చానెల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని చిత్రపరిశ్రమ స్పందించాలని కోరుకోవడం ఏమాత్రం సబబు కాదన్నారు. అదేమంత తేలికైన విషయం కాదన్నారు. చిత్రపరిశ్రమలోని వ్యక్తులు కళాకారులే గానీ, రాజకీయ నేతలు కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన కోరారు. సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి వారు కూడా రాజకీయాలపై మాట్లాడలేరని, ఒకవేళ ఏదైనా మాట్లాడితే ఎంతటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయో అందరికీ తెలిసిందేనని చెప్పారు.