సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (10:27 IST)

అట్టహాసంగా వంగవీటి రాధా, పుష్పవల్లి వివాహం.. హాజరైన పవన్

Vangaveeti Radha
Vangaveeti Radha
టీడీపీ నేత వంగవీటి రాధా, పుష్పవల్లి వివాహం విజయవాడలో జరిగింది. రాధా పెళ్లి వేడుకకు విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్ వేదికగా నిలిచింది. 
 
రాధా, పుష్పవల్లి నిశ్చితార్థం ఆగస్టులో జరిగిన సంగతి తెలిసిందే. పుష్పవల్లి స్వస్థలం నర్సాపురం. ఏలూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జక్కం అమ్మణి, బాబ్జీ దంపతుల కుమార్తె పుష్పవల్లి. 
 
ఇకపోతే.. ఆదివారం రాత్రి జరిగిన ఈ వివాహానికి రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా నూతన వధూవరులు వంగవీటి రాధా, పుష్పవల్లికి శుభాకాంక్షలు తెలియజేశారు. వంగవీటి రాధాకు పార్టీలకు అతీతంగా మిత్రులు ఉండడంతో ఆయన పెళ్లిలో పలు పార్టీల నేతలు దర్శనమిచ్చారు.