గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 24 ఏప్రియల్ 2021 (11:47 IST)

గ్రామీణ వికాసంలో ఏపీ టాప్‌: నేడు ప్రధాని చేతుల మీదుగా అవార్డుల ప్రదానం

అమరావతి: సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు తర్వాత మన రాష్ట్రంలో పైరవీలకు తావులేని పాలన నడుస్తోంది. ఫలితంగా గ్రామ పాలన వికసిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక పాలనా పరిస్థితుల’ ఆధారంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో ఈ ఏడాది మన రాష్ట్రం ఏకంగా 17 అవార్డులను దక్కించుకుంది.

జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ నిర్వహించే సమావేశంలో శనివారం ఈ అవార్డులను  ప్రదానం చేయనున్నారు. అవార్డుల పోటీలో దేశవ్యాప్తంగా 74 వేల గ్రామ పంచాయతీలు పోటీ పడినట్టు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ప్రకటించింది.