కడప-బెంగుళూరు నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణ పనుల సంగతేంటి?: ప్రధానమంత్రి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రగతి అంశంపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఢిల్లీ నుండి జరిగిన ఈ వీడియో సమావేశంలో ముఖ్యంగా కడప-బెంగుళూరు, 268 కి.మీ.ల పొడవున నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణ పనుల ప్రగతిని ప్రధానమంత్రి ఏపి, కర్నాటక సిఎస్‌లను అడిగి తెలుసుకున్నారు.
ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన పధకంపై సమీక్షించారు. ఈ కేంద్రాలు ఏర్పాటుకు పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు, సివిల్ ఆసుపత్రుల్లో తగిన అద్దె లేని స్థలాలను కల్పించాలని ప్రధాని ఆదేశించారు.
విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్య, టిఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శులు అనిల్‌కుమార్ సింఘాల్, యం.టి కృష్ణబాబు, సెక్రటరీ సర్వీసెస్ శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు.