మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (12:56 IST)

మూడు రోజులు కడపలోనే జగన్

మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయకు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ నుంచి హెలీకాప్టర్‌ ద్వారా ఇడుపులపాయకు వెళ్లారు.
 
డిప్యూటీ సీఎం అంజాద్ బాష, ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రవీంద్రారెడ్డి, రఘురామి రెడ్డి, మేడా మలికార్జున రెడ్డి, సుధీర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ జఖియా ఖనం, కత్తి నరసింహ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, జిల్లా కలెక్టర్‌ హరికిరణ్, కర్నూలు రేంజ్ డిఐజి వెంకట్రామి రెడ్డి, స్థానిక వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు.

ఇడుపులపాయలోని వైఎస్సార్‌ అతిథి గృహంలో ముఖ్యమంత్రి బస చేయనున్నారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.