శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , గురువారం, 19 ఆగస్టు 2021 (10:33 IST)

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు రూల్స్ పుస్తకావిష్క‌ర‌ణ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు రూల్స్ పుస్తకాన్ని ఎం.డి. ద్వారక తిరుమల రావు ఆవిష్క‌రించారు. విజ‌య‌వాడ‌లోని ఆర్టీసీ బ‌స్ కాంప్లెక్స్ లో ఎండి చాంబర్ లో ఆర్టీసీ అధికారుల మధ్య ఈ స‌ర్వీస్ రూల్స్ ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఏ.కోటేశ్వర రావు,(అడ్మిన్) కె.ఎస్.బ్రహ్మానంద రెడ్డి (ఆపరేషన్స్), చీఫ్ మేనేజర్ (పర్సనల్) పి.వి.స్వరూపానంద రెడ్డి, డిప్యూటీ సి.పి.ఎం.(హెచ్.ఆర్.డి.) సామ్రాజ్యం, విజిలెన్సు & సెక్యూరిటీ ఏ.డి. శోభా మంజరి, సెక్యూరిటీ ఆఫీసర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.