సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (20:28 IST)

రోజా గురించి నన్ను మాట్లాడమని రెచ్చగొడుతున్నారా?: ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి

ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా నిన్న ప్రివిలైజ్ కమిటీ ముందు ఏడ్చేశారు. ఇది కాస్త తీవ్ర చర్చకు దారితీసింది. ఎమ్మెల్యేగా తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదంటూ కన్నీంటి పర్యంతమయ్యారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసేస్తున్నారని కన్నీళ్ళు పెట్టుకున్నారు రోజా.
 
అంతటితో ఆగలేదు ఎన్ని కమిటీల ముందుకు ఈ విషయాన్ని తీసుకువెళ్ళినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అంతేకాదు పరోక్షంగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి గురించి కూడా వ్యాఖ్యలు చేశారు రోజా. ఉపముఖ్యమంత్రి పుత్తూరులో ఉండటం.. అక్కడే అధికారులతో సమావేశమవుతున్నారు.
 
గతంలో ఇదేవిధంగా పుత్తూరులో నారాయణస్వామి ఒక పర్యటనలో పాల్గొనడం.. రోజాను పిలవకపోవడంతో రోజాకు కోపమొచ్చింది. ఇది కాస్త పెద్ద రాద్దాంతమే జరిగింది. దీనిపై నారాయణస్వామి కూడా ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ రెడ్లందరూ తనను ముందుకు తీసుకువచ్చారని.. కానీ ఇప్పుడు ఎందుకిలా జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు.
 
రోజా ఎందుకలా మాట్లాడారో ఆమె మనస్సాక్షిగా వదిలేస్తున్నానన్నారు నారాయణస్వామి. దళితుడైన తనను రెడ్లు ఆదరించారని.. వారే తనకు రాజకీయ భిక్ష పెట్టినట్లు చెప్పుకొచ్చారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవంటూ చెబుతూనే పార్టీలో ఇదంతా సహజమంటూ చెప్పుకొచ్చారు.